Hyderabad: మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం కేసు.. నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2024లో స‌రూర్‌న‌గ‌ర్ పిఎస్‌లో నిందితుడిపై పోక్సో యాక్ట్‌తో పాటు చైల్డ్ మ్యారెజ్ యాక్ట్ ప్ర‌కారం కేసు న‌మోదైంది. సూర్యాపేట జిల్లా న‌డిగూడెం మండ‌లం రామ‌చంద్రాపురానికి చెందిన ద‌ర్శ‌నం నాగ‌రాజు అబ్డుల్లాపూర్‌మెట్ లో తాపీ మేస్త్రీగా ప‌నిచేసేవాడు. స‌రూర్ న‌గ‌ర్‌లో ఉండే బాలిక‌ను పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నాగ‌రాజుపై కేసు న‌మోదు చేసిన‌ స‌రూర్ న‌గ‌ర్ పోలీసులుజైలుకు త‌ర‌లించారు.

ఈ కేసుపై రంగారెడ్డి జిల్లా ఫాస్ట్రాక్ కోర్టు .. నాగ‌రాజుకు 20 ఏళ్ల జైలు శిక్ష , రూ.20వేల జ‌రిమానా విధించింది. బాధితురాలికి రూ.6 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించింది. ఈ కేసు న‌మోదైన అనంత‌రం త్వ‌రిత‌గ‌తిన ద‌ర్యాప్తు పూర్తిచేసిన విచార‌ణాధికారి సైదిరెడ్డి, న్యాయ‌వాదులు, కోర్టుకు .. బాధిత కుటుంబ‌స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.