Air India Crash: అందుకే నేను క్షేమంగా బయటపడ్డా: మృత్యుంజయుడు రమేష్
అహ్మదాబాద్ (CLiC2NEWS): ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనూహ్య రీతిలో బయటపడ్డాడు. అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ కుమార్ ప్రమాద వివరాలను మీడియాకు వెల్లడించాడు.
“విమానం నుంచి నేను కిందికి దూకలేదు.. ప్లేన్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అది కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా.. అందుకే ప్లేన్ లో చెలరేగిన మంటలు నాకు అంటలేదు..“ అని విశ్వాస్ కుమార్ రమేష్ డిడి న్యూస్ తో తెలిపారు.
కాగా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రమేష్ ను శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రమేష్ కు ఎలాంటి ప్రాణ హాని లేదని ఈ సందర్భంగా వైద్యులు వెల్ల డించారు.