మావోయిస్టులకు కేంద్ర మంత్రి అమిత్ షా హెచ్చరిక..
రాయ్‌పుర్ (CLiC2NEWS): మావోయిస్టులను వర్షాకాలంలో కూడా నిద్రపోనీయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఆయుధాలు వీడి, అభివృద్ధి పథంలో కలిసి రావాలని ఆయన మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్న ఆయన రాయ్‌పుర్ అటల్ నగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్, సెంట్రల్ సైన్స్ ల్యాబ్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులు లొంగి పోయి, జనజీవన స్రవంతిలో చేరే వారికి సాయం అందజేస్తామన్నారు. ప్రతి సారి వర్షాకాలంలో పరిస్తితులను ఆసరాగా తీసుకుని మావోయిస్టులు విశ్రాంతి తీసుకునే వారని.. ఈ సారి వర్షాకాలంలో కూడా మావోయిస్తు ఏరివేత ఆపరేషన్లు కొనసాగిస్తామన్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.