రూ.48లక్షలు చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసిన బేగంపేట పోలీసులు
హైదరాబాద్ (CLiC2NEWS): బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కంపెనీలో రూ.48 లక్షలు చోరీ చేసిన నిందితుడిని బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పాటిగడ్డ సన్ స్టీల్స్ లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆ సంస్థలొ గతంలో పనిచేసిన గిరిదారి సింగ్.. ఈ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గిరిదారి సింగ్ను వివిధ కారణాలతో ఉద్యోగం నుండి తొలగించినట్లు సమాచారం. కంపెనీ వెనుక అద్దం పగలుగొట్టి లాకర్‌లోని నగదును చోరీ చేశాడు. నిందితుడిని ఆదిలాబాద్‌లో గుర్తించి అక్కడి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.