అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్‌కు భూ కేటాయింపులు ర‌ద్దు: హైకోర్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్, మీడియేష‌న్ సెంట‌ర్ (ఐఎఎంసి) కు శేరిలింగంప‌ల్లి మండ‌లం రాయ‌దుర్గం లో 3.5 ఎకరాల భూమిని . ఈ భూ కేటాయింపుల‌ను రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ర‌ద్దు చేసింది. ఐఎఎంసికి భూమిని కేటాయించ‌డాన్ని స‌వాల్ చేస్తూ రెండు వేర్వేరు ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్య‌లు దాఖ‌ల‌య్యాయి. న్యాయ‌వాది కె.రాఘునాథ్‌రావు, వెంక‌ట‌రామ్ రెడ్డి దాఖ‌లు చేసిన వ్యాజ్యాల‌పై జ‌స్టిస్ కె.ల‌క్ష్మ‌ణ్‌, జ‌స్టిస్ కె.సుజ‌న‌ల‌తో కూడాన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టగా.. జ‌న‌వ‌రిలో వాద‌న‌లు ముగిశాయి. ఐటి కారిడార్‌లో రూ.350 కోట్ల విలువ చేసే భూమిని సుప్రీంకోర్టు తీర్పుల‌కు విరుద్ధంగా కేటాయించార‌ని న్యాయ‌వాధి ర‌ఘునాథ్ కోర్టుకు తెలిపారు.

అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్, మీడియేష‌న్ సెంట‌ర్ హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డం కార‌ణంగా అంత‌ర్జాతీయ సంస్థ‌ల మ‌ధ్య త‌లెత్తే వివాదాల ప‌రిష్కారానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ కోర్టుకు వెల్డడించారు. అంతేకాకుండా స‌మ‌స్య‌లు న్యాయ‌స్థానాల్లోనే కాకుండా.. బ‌యట కూడా ప‌రిష్క‌రించుకోవ‌చ్చిన్నారు. దీంతో కోర్టుల‌కు కూడా భారం త‌గ్గుంతుంద‌న్నారు. ఇరువైపు వాద‌న‌లు ముగియ‌డంతో హైకోర్టు శుక్ర‌వారం తీర్పును వెలువ‌రించింది. ఐఎఎంసి భూకేటాయింపుతో పాటు, ప్ర‌స్తుత భ‌వ‌నం నిర్వ‌హ కోసం జారీ చేసిన జిఒల‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది.

Leave A Reply

Your email address will not be published.