Hyderabad: న‌గ‌రంలో జ‌గ‌న్నాథ రథ‌యాత్ర‌..

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలో ప‌లు ప్రాంతాల్లో జ‌గన్నాథ ర‌థ‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. సికింద్రాబాద్ , లోయ‌ర్ ట్యాంక్ బండ్ వ‌ద్ద‌నున్న ఇస్కాన్ మందిరాల నుండి వేర్వేరుగా ర‌థ‌యాత్ర‌లు సాగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మాల్లో న‌గ‌ర‌వాసులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. ర‌థ‌యాత్ర కొన‌సాగే ర‌హ‌దారుల‌పై అంద‌మైన రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు.

అటు ఒడిశాలోని పూరీలో జ‌గ‌న్నాధుడి ర‌థ‌యాత్ర శుక్ర‌వారం కొన‌సాగుతుంది. న‌గ‌ర వీధులన్నీ ఇసుకేస్తే రాల‌నంత‌గా భ‌క్తుల‌తో నిండిపోయాయి.

Leave A Reply

Your email address will not be published.