ఏలూరు జిల్లా బుట్టాయ‌గూడెం.. చెరువులో మునిగి ముగ్గురు మృతి

బుట్టాయ‌గూడెం (CLiC2NEWS): చేప‌లు ప‌ట్టేందుకు చెరువులోకి దిగిన ముగ్గురు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఏలూరి జిల్లా బుట్టాయ‌గూడెం మండ‌లం చిన్న ర‌వ్వారి గూడెం గ్రామానికి చెందిన దేవేంద్ర కుమార్‌, తెల్లం సీతారామ‌రాజు, తెల్లం కిశోర్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం దండిపూడి స‌మీపంలో ఉన్న చెరువులో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లారు. ఆ క్ర‌మంలో ప్ర‌మాద‌వశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు.. పోలీసుల‌కు , కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. మృత‌దేహాల‌ను చెరువునుండి వెలికితీశారు. మృతుల కుటుంబ‌సభ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. మ‌ర‌ణించిన వారిలో తెల్లం సీతారామ‌రాజు, కిశోర్ అన్న‌ద‌మ్ములు. కుటుంబంలోని కుమారులు ఇద్ద‌రూ మృత్యువాత ప‌డ‌టంతో ఆకుంటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.