‘రామాయ‌ణ‌’.. ర‌ణ‌బీర్‌, సాయిప‌ల్ల‌వి రెమ్యునురేష‌న్ ఎంతంటే..!

‘రామాయ‌ణ’ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితేశ్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో రణ‌బీర్ క‌పూర్ , సాయిపల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో రామాయ‌ణ ఇతిహాసంను తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ.1600 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్న‌ట్లు సమాచారం. మొద‌టి భాగం రూ.900 కోట్లు.. రెండోది రూ.700 కోట్ల‌ని స‌మాచారం. ఇదే నిజ‌మైతే భార‌తీయ చిత్రాల్లో అత్యంత ఖ‌రీదైన చిత్రంగా రామాయ‌ణ చిత్రం చరిత్ర సృష్టించ‌బోతోంది. ఈ క్ర‌మంలో హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ఒక్కో భాగానికి రూ.75 కోట్ల పారితోష‌కం తీసుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సాయి ప‌ల్ల‌వి మొత్తంగా రూ.12 కోట్లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రంలో రాముడిగా ర‌ణ‌బీర్‌, సీత‌గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. య‌శ్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు. కాజ‌ల్‌, ర‌కుల్ కూడా న‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.