AP: రూ.100తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్..!
అమరావతి (CLiC2NEWS): ఎపిలోని గ్రామ/ వార్డు సచివాలయాల్లో రూ.100.. నామమాత్రపు ఫీజుతో వారసత్వ భూముల (సక్సేషన్) రిజిస్ట్రేషన్‌లు త్వరలో జరగునున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ రూ.10లక్షల లోపు ఉంటే రూ. 100.. ఆపైన ఉంటే రూ. 1000 ఫీజును స్టాంపు డ్యూటి కింద వసూలు చేస్తారు. ఆస్తి యజమానులు మరణానంతరం వారసులకు సంక్రమించే వారసత్వపు ఆస్థికి మాత్రమే గ్రామ/ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగిలిన వాటిని యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చేస్తారు. ప
గత ఏడాదిలో వారసత్వ ఆస్తుల మ్యుటేషన్ సకాలంలో జరగటం లేదనే ఫిర్యదులు సుమారు 50వేలు వరకు ప్రభుత్వానికి అందాయి. మరో వైపు తమ ఆస్తిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అనే ఉద్దేశంతో కొందరు ఉంటున్నారు. దీంతో చనిపోయిన వారి పేర్లతోనే భూముల రికార్డుల ఉంటున్నాయి. దీంతోఅనేక సమస్యలు తలెత్తుతున్నాయి. యజమాని మరణించిన అనంతరం.. వారసులు భగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే గ్రామ/ వార్డు సచివాలాయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. అది కూడా నామమాత్రపు ఫీజుతో జరుగుతుంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ చేసేందుకు వారసులు ముందుకు వస్తారనే ఉద్దేశం. దీంతో భూముల రికార్డుల్లో వివరాల నమోదు (మ్యూటేషన్) అటోమెటిగ్గా జరిగిపోతుంది.