Vadodara: బ్రిడ్జి కూలి నదిలో పడిపోయిన వాహనాలు..
వడోదర (CLiC2NEWS): గుజరాత్లోని వడోదరలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలో కొంత భాగం బుధవారం కూలిపోయింది. వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. దీంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1985లో నిర్మించిన ఈ వంతెన పాతబడడంతో పాటు, ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కూలి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
గుజరాత్లోని వడోదర-ఆనంద్ పట్టణాలను కులపుతున్న ఈ వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నదిలో పడిపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ వంతెన కూలడానికి గల కారణాలు గుర్తించాలని సాంకేతిక నిపుణులను ఆదేశించారు.
వంతన కూలిన ఘటనపై ప్రధాని నరంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున ప్రకటించారు.