Jeedimetla: ఎటిఎం క్యాష్‌బాక్స్ ఎత్తుకెళ్లిన దుండగులు
జీడిమెట్ల (CLiC2NEWS): జీడిమెట్ల మార్కండేయ నగర్‌లో దుండగులు ఎటిఎంను ధ్వంసం చేసి క్యాష్‌బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. జీడిమెట్లలోని బాలానగర్‌లో మంగళవారం రాత్రి ఎసిపి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోనే ఎటిఎం చోరీ జరిగింది. దుండగులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎటిఎంను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి క్యాష్‌బాక్స్‌ను చోరీ చేశారు. సిసి కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.