శ్రీ‌వారి ద‌ర్శ‌నం అక్టోబ‌ర్ కోటా విడుద‌ల తేదీలు…

తిరుమ‌ల (CLiC2NEWS): క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌రుడి ద‌ర్శ‌నం, గ‌దుల కోటా అక్టోబ‌ర్ నెలకు సంబంధించిన వివ‌రాల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించింది. శ్రీ‌వారి ఆర్జిత సేవా టెక్కెట్లను జూలై 19న ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్ లో విడుద‌ల చేయ‌నుంది. ఈ సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ ల‌క్కీ డీప్ కోసం జూలై 21 ఉద‌యం 10 గంట‌ల‌కు వ‌ర‌కు ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోవ‌చ్చు.. ఈ సేవా టిక్కెట్లు పొందిన భ‌క్తులు జూలైన్ 21 నుంచి 23వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌లోపు డబ్బు చెల్లిస్తే ల‌క్కీ డీప్ టిక్కెట్ మంజూర‌వుతుంది. అలాగే క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహ‌స్త్ర‌దీపాలంకార సేవ‌, వార్షిక పుష్ప‌యాగం టిక్కెట్లు జూలై 22 ఉద‌యం 10 గంట‌ల‌కు..
వ‌ర్చువ‌ల్ సేవాలు, వాటి ద‌ర్శ‌న టిక్కెట్లు జూలై 22 మ‌ధ్య‌హ్నం 3 గంట‌ల‌కు

అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు జైలై 23 ఉద‌యం 10 గంట‌ల‌కు
శ్రీ‌వాణి ట్ర‌స్టు ఆన్‌లైన్ కోటా టికెట్లు జూలై 23 ఉద‌యం 11 గంట‌ల‌కు
వ‌యో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌న్న‌వారి ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు జూలై 23 మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు, రూ. 300 ప్రత్యేక ద‌ర్శ‌న టికెట్లు జూలై 24 ఉద‌యం 10 గంట‌ల‌కు, తిరుమ‌ల‌, తిరుప‌తి లో గ‌దుల బుకింగ్ జూలై 24 మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.
వివ‌రాలు టిటిడి వెబ్‌సైట్లో https://ttdevasthanams.ap.gov.in మాత్ర‌మే శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌నం టిక్కెట్లు, గ‌దులు బుక్ చేసుకోవాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేసింది.

Leave A Reply

Your email address will not be published.