Malakpet: శాలివాహన నగర్ పార్క్‌లో కాల్పులు.. ఒకరు మృతి
మలక్‌పేట (CLiC2NEWS): శాలివాహన నగర్ పార్క్‌లో సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చందునాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. దుండగులు కారులో వచ్చి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. చందునాయక్ .. పార్క్‌కు తన భార్య , కుమార్తెతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లగా ఈ దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన రాజేశ్, సుధాకర్ మరో ఇద్దరు నిందితులు ఎస్ఒటి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
చందునాయక్ .. సిసిఐ ఎంఎల్ నుండి కన్నేళ్ల క్రితం సిపిఐలో చేరారు. 2022 ఎల్బినగర్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. భూతగాదాల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో 5 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిసి కెమెరాతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న అని కెమెరాల పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించినట్ల పోలీసులు తెలిపారు.