Delhi: కేంద్రమంత్రి అమిత్ షాతో ఎపి సిఎం చంద్రబాబు భేటీ..
ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఎపికి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా సిఎం ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రానికి ఆర్ధిక సాయం సహా పలు అంశాల గురించి ఇరువురు చర్చించారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని సిఎం కోరారు.
బయకచర్ల ప్రాజెక్టు విషయంపై చంద్రాబాబు ఈ భేటీలో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును రూ.82 వేల కోట్లతో ప్రతిపాదించినట్లు తెలిపారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకునే హక్కు ఎపికి ఉందన్నారు. ఎపి ఎదుర్కుంటున్న నష్టంపై ఆర్ధిక సంఘానికి నివేదించినట్లు అమిత్‌షాకు చంద్రబాబు తెలిపారు. మాజి మంత్రి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించిన నేపథ్యంలో ఈ సందర్భంగా అమిత్ షాకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు.