Hyderabad: ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారం తిని ఒకరు మృతి.. ఏడుగురికి అస్వస్థత
వనస్థలిపురం (CLiC2NEWS): ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారం వేడి చేసి తిన్న కుటుంబంతో ఒకర మృతి చెందగా.. మరో ఏడుగురు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం, చింతల్‌కుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింత్‌కుంట ఆర్టిసి కాలనిలో ఉంటున్న శ్రీనివాస్ కుటుంబం ఆదివారం బోనాల పండగ సందర్బంగా మటన్, బోటి, చికెన్ వండుకొని తినగా మిగిలినది ఫ్రిజ్‌లో పెట్టారు. సోమవారం ఆ మాంసాన్ని వేడి చేసి మళ్లీ తినగా.. కుటుంబంలోని సభ్యులందరూ అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం శ్రీనివాసవ్ యాదవ్ మృతి చెందారు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Thanks for any other fantastic post. The place else could anybody get that
type of information in such a perfect manner of writing?
I’ve a presentation subsequent week, and I am on the
search for such information.