కాకినాడ జిల్లాలో జ‌ల‌మ‌య‌మైన మాయ‌ప‌ట్నం విలేజ్‌

కాకినాడ (CLiC2NEWS): వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా బంగాళాఖాతంలో రాకాసి అల‌ల ఉధృతి పెరిగింది. దాంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలోని గ్రామాలు కోత‌కు గుర‌వుతున్నాయి. బుధ‌వారం ఉద‌యం కొత్త ప‌ల్లి మండ‌లంలోని మాయ‌ప‌ట్నం వ‌ద్ద స‌ముద్రం ఉధృతి పెరిగింది. దాంతో మాయ‌ప‌ట్నం గ్రామం జ‌ల‌మ‌య‌మైంది. స‌ముద్ర ఉధృతికి ప‌లు ఇళ్లలోకి స‌ముద్ర‌పు నీరు చేరింది. దాంతో గ్రామ‌స్తులు బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే 20కి పైగా గ్రామాలు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. అధికారులు గ్రామంలోని స‌ముద్ర‌పు నీటిని వెన‌క్కి మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ర‌క్ష‌ణ గోడ‌లు ధ్వంసం కావ‌డంతో ఈ ప్రాంతంలో త‌ర‌చూ స‌ముద్ర‌పు నీరు గ్రామంలోకి చేరుతుంది.

 

Leave A Reply

Your email address will not be published.