చైనీయుల‌కు భార‌త్ టూరిస్టు వీసాలు జారీ..

Tourist Visa: చైనా పౌరుల‌కు భార‌త్‌లో ప‌ర్య‌టించేందుకు టూరిస్టు వీసాల జారీ ప్ర‌క్రియ‌ను పునఃప్రారంభించారు. కొవిడ్ , గ‌ల్వాన్ సంఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో భార‌త్‌, చైనా పౌరుల‌కు జారీ చేసిన టూరిస్ట్ వీసాల‌ను స‌స్సెండ్ చేశారు. దాదాపు ఐదు సంవ‌త్స‌రాల అనంత‌రం ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు మెరుగుప‌రిచేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో చేసీయుల‌కు భార‌త్ టూరిస్టు వీసాల జారీ ప్ర‌క్రియ‌ను పునఃప్రారంభిస్తున్న‌ట్లు చైనాలోని రాయ‌బార కార్యాల‌యం వెల్ల‌డించింది. రేప‌టి నుండి చైనా పౌరుల‌కు టూరిస్టు వీసాలు మంజూరు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

కొవిడ్ -19, గ‌ల్వాన్ సంఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో భార‌త్ – చైనా ఇరు దేశాల మ‌ధ్య విభేదాలు తలెత్తిన విష‌యం తెలిసిందే. కొవిడ్ ప్రారంభంలో చైనాలోని ఉన్న‌త విద్య‌న‌భ్య‌సిస్తున్న భార‌తీయ విద్యార్థులు సుమారు 22 వేల మంది స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో భార‌త్ అన్ని దేశాల టూరిస్టు వీసాల జారీని నిలిపి వేసింది.

Leave A Reply

Your email address will not be published.