ఆర్‌టిసి బ‌స్సు లోయ‌లో ప‌డి ఐదుగురు మృతి

సిమ్లా (CLiC2NEWS): ఆర్‌టిసి బ‌స్సు అదుపు త‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మండికి 60 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. మిగిలిన వారికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 25 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల‌లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.