రష్యాలో కుప్ప‌కూలిన విమానం.. 49 మంది మృతి

An-24: అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఎఎన్‌-24 విమానం గురువారం కుప్ప‌కూలి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. 49 మందితో వెళుతున్న ఈ విమానం ర‌ష్యాలోని అమూర్ ప్రాంతంలో కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ప్ర‌యాణికులంద‌రూ మృతి చెందిన‌ట్లు స‌మాచారం. బ్లాగోవెష్‌చెన్స్క్ నుండి చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి 46 మంది ప్ర‌యాణికులు , ఆరుగురు సిబ్బందితో బ‌య‌లు దేరిన విమానం.. లాండ్ అయ్యే స‌మ‌యానికి ఎయ‌ర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్స్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఎమ‌ర్జ‌న్సీ స‌ర్వీసెస్ సిద్దం చేశారు. విమానం గ‌మ్య‌స్థానానికి చేరే లోపే.. 15 కిలో మీట‌ర్ల దూరంలో కూలిపోయిన‌ట్లు అధికారులు గుర్తించారు.

ఎఎన్‌-24 విమానం ముందుగా ల్యాండింగ్‌కు ప్ర‌య‌త్నించ‌గా.. అనుకూలించ‌లేదు. రెండో సారి ల్యాండింగ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. రాడార్ నుండి గ‌ల్లంతై కూలిన‌ట్లు తెలుస్తోంది. అదృశ్య‌మైన‌ట్లు వార్త‌లు రాగా..కాసేప‌టికి అది కూలిపోయిన‌ట్లు అధికారులు గుర్తించారు. విమానంకూలిన ప్రాంతంలో శ‌క‌లాల‌కు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో 49 మంది మ‌ర‌ణించార‌ని ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసెస్ చెప్పిన‌ట్లు ర‌ష్యా అధికారిక‌ మీడియా స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.