రూ.లక్షకు కోడలిని అమ్మేసిన అత్తమామలు!
అర్ని (CLiC2NEWS): భర్తను కోల్పోయిన కోడలు అత్తమామల ఇంట్లో నివసిస్తుంది. ఆమెకు అండగా నిలవాల్సిన అత్తమామాలు రూ.లక్షకు అమ్మేసారు. ఈ ఘటన మహారాష్ట్రలో యావత్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే బాధితురాలి భర్త, కుమారుడు కొన్నేళ్ల క్రితం చనిపోయారు. అనంతరం ఆమె అత్తమామల ఇంట్లో నివసిస్తోంది. కోడలిని గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.లక్ష ఇరవై వేలకు అమ్మేందుకు అత్తమామలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి రెండేళ్లపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేసి.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాధితురాలిని గ్రామంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.