AP: ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
అమరావతి (CLiC2NEWS):ఎపి ఆయుష్ విభాగంలో పలు పోస్టుల భర్తీ చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆయుష్ సేవల విస్తరణ కోసం సత్వర నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పోస్టులలో 71 మంది డాక్టర్లు.. 26 జిల్లాలకు ప్రోగ్రాం మేనేజర్లు.. సహాయకులతో పాటు 90 మంది పంచకర్మ థెరపిస్టులతో కలిపి మొత్తం 358 పోస్టుల నియామకాలకు మంత్రి ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆయుష్ సేవలపై కేవలం రూ.37 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని.. ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2024-25 సంవత్సరానికి కేంద్రం ఆమోందిచన స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు.