మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత నార్ల శ్రీవిద్య అరెస్టు
హైదరాబాద్ (CLiC2NEWS): మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత నార్ల శ్రీవిద్యను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై రూ. 5లక్షల రివార్డు ఉంది. నార్ల శ్రీవిద్య అలియాస్ కరుణ అలియాస్ రూప.. 1992లో మావోయిస్టు పార్టీలో చేరారు. చైతన్య మహిళా సమాఖ్య, యుజి క్యాడర్లో ఆమె పనిచేశారు. ప్రస్తుతం ఆమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్, దంతెవాడ, బీజాపుర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా తిరుమలాపురానికి చెందిన నార్ల శ్రీవిద్య .. జెన్‌టియు హైదరాబాద్‌లో బిటెక్ పూర్తి చేశారు. ఐపిఎస్ అధికారి ఉమేశ్‌చంద్ర హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నను ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు. గతంలో అరెస్టయిన నార్ల రవిశర్మ శ్రీవిద్య సోదరుడు.