ACA కమిటి అధ్యుక్షుడిగా కేశినేని శివనాథ్
విజయవాడ (CLiC2NEWS): ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటి (ACA) నూతన అధ్యక్షుడిగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఎంపి ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో ఎసిఎ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. 34 మందితో నూతన కమిటి ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడుగా కేశినేని, కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం మూడేళ్ల కాలపరితితో రాష్ట్రంలోని క్రికెట్ అభివృద్ధికి కృషి చేయనుంది. ఈ ఎన్నికకు మాజి ఎస్ ఇసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో నిర్వహించబోయే పనులు, స్టేడియాల నిర్మాణం, టోర్నమెంట్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎసిఎ ప్రతిష్ట మరింతగా పెంచే విధంగా కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Also Read: డిస్టెన్స్ ఎడ్యుకేషన్: వచ్చేనెల 7న ఎంబిఎ, ఎంసిఎ ప్రవేశ పరీక్ష