ఎన్‌డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును బిజెపి ఖరారు చేసింది
ఢిల్లీ (CLiC2NEWS): ఎన్‌డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును బిజెపి ఖరారు చేసింది. ఈ మేరకు పార్టి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ మమారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఎన్‌డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ , బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు అప్పగించారు.
ఢిల్లీలో నేడు భారతీయ జనతాపార్టి నిర్వహించిన పార్లమెంటరీ పార్టి బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారు. సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూర్ నుండి లోక్‌సభకు రెండు సార్లు ఎంపికయ్యారు. అదేవిధంగా ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆయన 2023లో ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
[…] […]
[…] […]
[…] గవర్నర్ సిపి రాధాకృష్ణన్ (C. P. Radhakrishnan)ను ఎంపిక […]
[…] Also Read: ఎన్‌డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఖర… […]