Afghanistan: బస్సు ప్రమాదంలో 73 మంది దుర్మరణం
73 killed in bus accident
కాబుల్ (CLiC2NEWS): అఫ్ఘానిస్థాన్(Afghanistan)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారుల బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 73 మంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో 17 మంది చిన్నారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల ఇరాన్ నుండి బహిష్కరణకు గురైన అఫ్ఘాన్ వలసదారులు ప్రయాణిస్తున్న బస్సు పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో బస్సులో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద విషయం తెలసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దాదాపు 73 మంది ప్రయాణికులు మరణించారు. మృతి చెందిన వారిలో 17 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం వల్లనే ప్రమాదం జరిగిందని హెరాత్ పోలీసులు తెలిపారు. కాగా దశాబ్దాల కాలంగా భారీగా దెబ్బతిన్న రహదారులు కూడా ఈ ప్రమాదానికి కారణమైన ఉండొచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఢిల్లీ సిఎంపై దాడి!
[…] Also Read: Afghanistan: బస్సు ప్రమాదంలో 73 మంది దుర్మర… […]