High Court: కెసిఆర్‌, హ‌రీశ్‌రావు పిటిష‌న్‌ల‌పై నేడు విచార‌ణ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జ‌స్టిస్ పిసి ఘోష్ క‌మిష‌న్ నివేదిక‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ మాజి ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, హ‌రీశ్‌రావు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. నేడు ఉన్న‌త న్యాయ‌స్థానం ఆ పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టింది. కెసిఆర్ త‌ర‌పు సుప్రీం కోర్టు న్యాయ‌వాది ఆర్యాను సుంద‌రం.. జ‌స్టిస్ పిసి ఘోష్ క‌మిష‌న్ నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని కోర్టుకు త‌మ వాద‌నలు వినిపించారు. క‌మిష‌న్ స‌మ‌ర్పించిన నివేదిక‌ను ప్ర‌భుత్వం ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చింద‌ని న్యాయ‌స్తానంకు వెల్ల‌డించారు. ఆ నివేదిక‌ను కెసిఆర్‌, హ‌రీశ్‌రావుకు ఇవ్వ‌లేద‌ని తెలిపారు. నివేదిక బిఆర్ ఎస్‌కు, కెసిఆర్‌కు న‌ష్టం క‌లిగించే విధంగా రూపొందించార‌న్నారు.

క‌మిష‌న్ నివేదిక‌ను అసెంబ్లీలో చ‌ర్చించేలా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్న‌ట్లు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ సుద‌ర్శ‌న్ రెడ్డి న్యాయ‌స్థానానికి తెలిపారు. ఇద్ద‌రు పిటిష‌న‌ర్లు అసెంబ్లీలో స‌భ్యులుగా ఉన్నార‌న్నారు. అలాంట‌పుడు నివేదిక‌ను ఎందుకు బ‌య‌ట‌పెట్టార‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌ను న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది.న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పించిన నివేదిక కాపీలు స్ప‌ష్టం లేవ‌ని.. స్ప‌ష్టం గా ఉన్న కాపీలు స‌మ‌ర్పిస్తే విచార‌ణ చేప‌డ‌తామ‌ని సిజె అన్నారు.

Also Read: హైకోర్టులో మాజి సిఎం కెసిఆర్ పిటిష‌న్

Leave A Reply

Your email address will not be published.