భార్య‌ను ముక్కుల‌గా చేసి మూసీలో ప‌డేసిన భ‌ర్త‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): బోడుప్ప‌ల్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రేమ వివాహం..  భార్య‌ను హ‌త్య చేసి ముక్క‌లుగా న‌రికి మూసీలో ప‌డేశాడు ఓ భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లా మ‌ల్కాజిగిరి జిల్లా బోడుప్ప‌ల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఏడాదిన్న‌ర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న స్వాతి, మ‌హేంద‌ర్ బోడుప్ప‌ల్లో నివాస‌ముంటున్నారు. మ‌హేంద‌ర్ రెడ్డి ర్యాపిడో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. స్వాతి కాల్ సెంట‌ర్లో జాబ్ చేస్తోంది. గ‌త కొన్నాళ్లుగా వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో 23వ తేదీ సాయంత్రం స్వాతిని హ‌త్య చేసిన‌ట్లు స‌మాచారం. హ‌త్య చేసిన అనంత‌రం ఆమె చేతులు, త‌ల , కాళ్లు, మెండెం వేరుచేసి క‌వ‌ర్ల‌లో తీసుకెళ్లి మూసీన‌దిలో ప‌డేశాడు. అనంత‌రం భార్య చెల్లెలికి ఫోన్ చేసి స్వాతి క‌నిపించ‌డం లేద‌ని తెలిపాడు. ఆమె మేన‌మామ గోవ‌ర్థ‌న్ కు విష‌యం చెప్పింది.

గోవ‌ర్ధ‌న్ రెడ్డి, మ‌హేందర్ క‌లిసి శ‌నివారం రాత్రి ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అక్క‌డ పోలీసులు బోడుప్ప‌ల్ బాలాజిహిల్స్ మేడిప‌ల్లి ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని.. మీరు వెళ్లి మేడిప‌ల్లి పిఎస్‌లో ఫిర్యాదివ్వ‌మ‌ని పంపించారు. అయితే, ఫిర్యాదు తీసుకునే క్ర‌మంలో మేడిప‌ల్లి పోలీసులు మ‌హేంద‌ర్ రెడ్డిని ప‌లుమార్లు ప్ర‌శ్నించ‌డంతో తానే త‌న భార్య స్వాతిని హ‌త్య చేసిన‌ట్లు అంగీక‌రించాడు.

కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈరోజు మ‌హేంద‌ర్ ఉండే ఇంటికి వెళ్లి చూడ‌గా.. అక్క‌డ కేవ‌లం మొండెం మాత్ర‌మే ఉంద‌ని తెలిపారు. జిహెచ్ ఎంఇ, ఎస్‌డిఆర్ ఎఫ్ సిబ్బంది సాయంతో మ‌హిళ శ‌రీర భాగాల కోసం మూసీ న‌దిలో గాలిస్తున్నారు.

Alsog Read: ISRO: తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజ‌య‌వంతం

2 Comments
  1. […] Crime news: భార్య‌ను ముక్కుల‌గా చేసి మూసీలో ప‌డే… […]

  2. […] Also Read: రాష్ట్రంలోని గ‌ణేశ్ మండ‌పాల‌కు ఫ్రీ … […]

Leave A Reply

Your email address will not be published.