Mancherail: గణేష్ నవరాత్రుల్లో భరతనాట్యం
మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల పట్టణంలోని రాంనగర్లో శ్రీ భక్త మార్కండేయ స్వామి గణేష్ మండలి నవరాత్రుల్లో భాగంగా ఆదివారం చిన్నారుచే భరతనాట్య కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ అద్భుతమైన నృత్య ప్రదర్శనతో వీక్షకులను అలరించారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి కాలనీ వాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పూజా కార్యక్రామాంనంతరం స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఈ కార్యక్రమం వీక్షించి హర్షం వ్యక్తం చేశారు.