రూ.ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేసినా ల‌క్ష ఎక‌రాల‌కు కూడా నీరు ఇవ్వ‌లేదు: మంత్రి ఉత్త‌మ్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్ర అసెంబ్లీలో కాళేశ్వ‌రం నివేదిక‌పై చ‌ర్చ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. డ్యామ్‌కు, బ్యారేజికి తేడా లేకుండా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నులు చేశార‌ని ఎన్‌డిఎస్ఎ నివేదిక‌లో ఉంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జ‌రిగిన అనంత‌రం రాష్ట్రంలో చేప‌ట్టిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వ‌ర‌మ‌న్నారు. రూ.38వేల కోట్ల‌తో పూర్త‌య్యే ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టును వ‌దిలేసి, రూ.1.47 ల‌క్ష‌ల కోట్ల‌తో కాళేశ్వ‌రం చేప‌ట్టార‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు గుండెకాయ‌లాంటి మేడిగ‌డ్డ దెబ్బ‌తింద‌న్నారు. పూర్తి నీరు నిల్ల చేసి కూలిపోయేందుకు కార‌ణ‌మ‌య్యార‌ని మంత్రి పేర్కొన్నారు. 3 బ్యారేజిలు 20 నెల‌లుగా నిరుప‌యోగంగా మారాయ‌ని తెలిపారు. కాళేశ్వ‌రం నుండి ఏడాదికి 20.2 టిఎంసిల నీటిని మాత్ర‌మే లిప్ట్ చేశార‌ని, రూ. ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేసినా ల‌క్ష ఎక‌రాల‌కు నీరు ఇవ్వ‌లేద‌న్నారు.

 

మాట్లాడేందుకు 2 గంట‌ల స‌మ‌యం కావాలి: హ‌రీశ్‌రావు

Leave A Reply

Your email address will not be published.