kamareddy: వరద బాధితులకు సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మందులు పంపిణి
కామారెడ్డి (CLiC2NEWS): ఇటీవల కామారెడ్డిలో సంభవించినటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు హోమియోపతి మందులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి సహకారంతో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకాని శివప్రసాద్ పట్టణ కేంద్రంలో వరదలు సంభవించిన ప్రాంతాలలో సందర్శించి వారికి డాక్టర్ల బృందంతో కలిసి హోమియోపతి నివారణ మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వరద బాధితులకు సహస్ర ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్ని అన్నారు ప్రతి ఒక్కరూ నివారణ మందులు తీసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకాని శివప్రసాద్, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మహేష్, ఐఐహెచ్ పి స్టేట్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ హరీష్, కోఆర్డినేటర్ సీలివేరు సైదులు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
Also Read : నేను ఎవరి వెనుకా లేను, ప్రజల వెంట మాత్రమే ఉంటా.. సిఎం రేవంత్
