భారత్‌లో తొలి టెస్లా కారు విక్రయం..
ముంబయి (CLiC2NEWS): ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ టెస్లా(Tesla).. భారత్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా దేశంలో మధ్య శ్రేణి ఎస్‌యువి మోడల్ వై కారు విక్రయాలు మొదలయ్యాయి. అయితే, తొలి టెస్లా కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ కొనుగోలు చేశారు. ముంబయిలోని ‘టెస్లా ఎక్స్ పీరియెన్స్ సెంటర్’ లో మంత్రి తెలుపు రంగు టెస్లా మోడల్ వై కారు తాళాలను అందుకున్నారు.
విద్యుత్ కార్ల సంస్థ టెస్లా .. జులై 15న ముంబయిలో తొలి షోరూంను ప్రారంభించింది. చైనాలోని తమ ప్లాంట్‌లో తయారైన కారును దిగుమతి చేసుకొని విక్రయాలు చేపట్టింది. మొదటి కారును కొనుగోలు చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. తొలి కారును తాను కొనుగోలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. పర్యావరణహిత వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
Tesla Model Y Car ..ఈ కారు రెండు వేరియంట్లలో ఉంటుంది. రేర్-వీల్ డ్రైవ్ వేరియంట్.. దీని ధర రూ. 59.89 లక్షల నుండి మొదలవుతుంది. ఒక సారి ఛార్జింగ్ తో 500 కిలోమీటర్లు ప్రయాణించవచచు.
లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్.. దీని ధర రూ. 67.89 లక్షలు నుండి ప్రారంభమవుతుంది. ఒకసారి ఛార్జింగ్ తో 622 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు.
Kamareddy: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు..
[…] భారత్‌లో తొలి టెస్లా కారు విక్రయం.. […]