దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు ప్రసిద్ధి ఖైరతాబాద్: సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): ఖైరతాబాద్ మహాగణపతిని సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. గతంలో పిసిసి అధ్యక్షుడిగా , ఇపుడు సిఎం గా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి అన్నారు. 71 ఏళ్ల చరిత్ర కలిగిన గణేశ్ ఉత్సవ సమితి ముందుగా ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్ఠించి.. ఇపుడు ఈ స్తాయికి చేరుకుందన్నారు. ఒక్కసారి నిర్వహణే కష్టమయ్యే ప్రస్తుత రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటూ ఖైరతాబాద్ ఉత్సవ సమితి ఈ ఉత్సవాలను కొనసాగిస్తుందని కొనియాడారు. ప్రభుత్వం తరపున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సిఎం తెలిపారు.
[…] […]