ఉప రాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ విజయం
ఢిల్లీ (CLiC2NEWS): ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి సిపి రాధా కృష్ణన్ ఘన విజయం సాధించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు. రాధాకృష్ణన్ ప్రత్యర్థి అయిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటి సాధించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ సభ్యులు 767 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా.. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. భారత రాష్ట్ర సమితి, బిజెడి, శిరోమణి అకాళీదళ్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. భారత 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. రాధాకృష్ణన్ తమిళనాడు నుండి ఉప రాష్ట్రపతి పీఠం అధిష్టనించనున్న మూడో వ్యక్తి.
[…] […]