హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రాటెక్ సర్వీస్‌లొ 31 మేనేజర్ పోస్టులు
HLL: ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రాటెక్ సర్వీసెస్ లిమిటెడ్ లో 31 మేనేజర్ పోస్టులు కలవు. దేశవ్యాప్త కార్యాలయాలు/ ప్రాజెక్టుల కోసం రెగ్యులర్ / ఫిక్సెడ్ టర్మ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిప్లొమా, డిగ్రీ, బిఇ/ బిటెక్/ సిఎ/ ఐసిడబ్ల్యుఎ, ఎంబిఎ , బిఫార్మ్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులను సెప్టెంబర్ 18వ తేదీ లోపు పంపించాల్సి ఉంది.
డిప్యూటి మేనేజర్ పోస్టులు – 19
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 40,000 – రూ. 1,40,000
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లకు మించకూడదు.
అసిస్టెంట్ మేనేజర్ – 12
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు జీతం రూ. 30వేలు – రూ.1,20,000 అందుతుంది.
అభ్యర్థుల వయస్సు 37 ఏళ్లకు మించకూడదు.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ www.lifecarehll.com చూడగలరు.
Also Read: ఇక నుండి ఓయులో ఎఐ, ఎంఎల్ నైపుణ్యాలు
[…] […]
[…] […]