వాంకిడి: నీటి మడుగులో మునిగి నలుగురు మృతి
కొమరం భీం జిల్లా వాంకిడిలో మండలంలో విషాదం..
వాంకిడి (CLiC2NEWS): నీటి మడుగులో మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు, మహిళ ఉన్నారు. ఈ ఘటన కొమరం భీం జిల్లా వాంకిడి మండలం డాబా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలంలో పనిచేస్తూ నీటి కోసం ముగ్గురు చిన్నారులు నీటి మడుగులోకి దిగారు. మునిగిపోతున్న చిన్నారులను కాపాడేందుకు ఓ మహిళ నీటి కుంటలోకి దిగింది. కుంటలో మునిగి మహిళతో పాటు ఆమె కుమారుడు, మరో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించారు. దీంతో డాబా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: ఎపి క్రికెట్ అసోసియేషన్ కొత్త కోచ్ న్యూజిలాండ్ మాజి క్రికెటర్ గ్యారి స్టీడ్