తమిళ సర్కార్కు సుప్రీంలో చుక్కెదురు
ప్రజాధనంతో నేతల విగ్రహాలా: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ(CLiC2NEWS): తమిళనాడు సర్కార్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళ దింగత మాజీ సిఎం కరుణానిధి విగ్రహం ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లో చుక్కెదురైంది. ఈ నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. “ మీ నాయకుల విగ్రహాల కోసం ప్రజల ధనాన్ని ఎలా వాడుకుంటారు“.. అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తమిళ సర్కార్ ఈ పిటిషన్ ను వెనక్కి తీసుకొని మద్రాసు హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే.. తిరున్వేలి జిల్లాలోని వల్లియూర్ కూరగాయల మార్కెట్ ముఖ ద్వారం వద్ద కరుణానిధి విగ్రహం ఏర్పాటు చేసేందుకు తమిళ సర్కార్ అనుమతి కోరింది. ఈ పిటిషన్పై అసహనం వ్యక్తం చేసి సుప్రీం కోర్టు గతంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
బహిరంగ ప్రదేశాల్లో నాయకుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఇలాంటి ప్రదేశంలో విగ్రహాల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులకు గురవుతారని కోర్టు అనుమతినిరాకరించింది. అలాగే విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందనే విషయాన్ని మద్రాసు హైకోర్టు గుర్తు చేసింది.
Aslo Read : సింగరేణి కార్మికులు బోనస్
[…] తమిళ సర్కార్కు సుప్రీంలో చుక్కెద… […]
[…] తమిళ సర్కార్కు సుప్రీంలో చుక్కెద… […]