జంట‌న‌గ‌రాల్లో బ‌స్సు భారం!

రేప‌టి నుంచి పెరిగిన టిక్కెట్ రేట్లు అమ‌ల్లోకి..

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్‌-సికింద్రాబాద్ జంట‌న‌గ‌రాల్లోని సిటీ బ‌స్సుల్లో బ‌స్సు ఛార్జీలు పెంచ‌నున్న‌ట్లు ఆర్టీసీ ప్ర‌క‌టించింది. పెరిగిన ఛార్జీలు మొద‌టి మూడు స్టేజీల‌కు రూ. 5, నాలుగో స్టేజీ నుంచి చివ‌రి స్టేజీ దాకా రూ. 10 అద‌నంగా ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ఛార్జీలు సిటీ ఆర్డీన‌రి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎల‌క్ట్రిక్ బ‌స్సులు(ఆర్డిన‌రి), ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల‌లో పెంచ‌నున్న‌ట్లు ఆర్టీసీ తెలిపింది.

మెట్రో డీల‌క్స్‌, మెట్రో ఎల‌క్ట్రిక్‌, మెట్రో ఎసీ స‌ర్వీసులలో మొద‌టి స్టేజీకి రూ. 5, రెండో స్టేజీ నుంచి చివ‌రి దాకా రూ. 10 అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఆర్టీసీ బ‌స్సుల్లో పెరిగిన ఛార్జీలు ఏప‌టి నుంచి (6వ తేదీ సోమ‌వారం) నుంచి అమ‌లులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించింది.

Also Read: వ‌చ్చేనెల 23న భార‌త్‌కు నీర‌వ్ మోడీ అప్ప‌గింత‌!

1 Comment
  1. […] Also Read: జంట‌న‌గ‌రాల్లో బ‌స్సు భారం! […]

Leave A Reply

Your email address will not be published.