ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి కోటా విడుదల
తిరుమల (CLiC2NEWS):తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జనవరి కోటాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. వీటితో పాటు అంగ ప్రదిక్షణ టోకెన్లను కూడా ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనున్నది. ఈ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం , ఊంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను అక్టోబర్ 23 ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనున్నారు.
ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
24 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికట్ల కోటాను అందుబాటులో ఉంటాయి.
24 మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు.
25 వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
25 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను విడుదల చేస్తారు.
[…] […]