ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం, ఆరుగురు మృతి

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం పాటిగ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. జైలో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులు జార్ఖండ్‌ ఘోరఖ్‌పూర్‌, రాంఘడ్‌కు చెందిన కార్పెంటర్లుగా గుర్తించారు. గచ్చిబౌలి నుంచి జార్ఖండ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనం గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.