బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఎపిలో ఎల్లో అలెర్ట్

విశాఖ‌ప‌ట్ట‌ణం (CLiC2NEWS): ఎపిలోని ప‌లుచోట్ల భారీ నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నైరుతి బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడ‌న ప్రభావంతో ఈ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది.

ఈ అల్ప‌పీడ‌నం రానున్న 36 గంట‌ల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవ‌కాశం ఉంది. దీంతో ముందస్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా అధికారులు రాష్ట్ర వ్యాంప్తంగా ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

ఈ ప్ర‌భావంతో ఇవాళ (మంగ‌ళ‌వారం) నెల్లూరు, తిరుప‌తి, ఒంగోలు జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది అని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

బుధ‌వారం భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఎల్లో అలెర్ట్ జారీ చేయ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: చిరు నివాసంలో `తార‌ల‌` దీపావ‌ళి వేడుక‌లు..

Leave A Reply

Your email address will not be published.