బిఆర్ ఎస్ నేతలతో కెసిఆర్ (KCR) సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దిశానిర్దేశం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా రాజీకీయ పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. నామినేషన్లు ముగియడంతో ప్రచారంపై పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష పార్టీ బిఆర్ ఎస్ స్టార్ క్యాంపెయినర్ లను ప్రచారం కోసం ప్రకటించాయి.
తాజాగా నేడు (గురువారం) మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) పలువురు పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సునితా లక్ష్మారెడ్డి , నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కెసిఆర్ (KCR) తో సహా నాయకులంతా జూబ్లీ హిల్స్ ప్రచారంపై చర్చించారు. నియోజకవర్గంలో చేరికలు, అక్కడి నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికలో బిఆర్ ఎస్ అభ్యర్థిగా ఆయన సతీమణి సునీత పోటీ చేస్తున్న విషయం విధితమే.
Also Read: మళ్లీ పెరిగిన బంగారం ధర..