ప‌.గో. జిల్లా బుట్టాయ‌‌గూడెంలో అగ్ని ప్ర‌మాదం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం కంసాలకుంట గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కట్టం సోమరాజు అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. రూ.10,000నగదు, ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు లక్ష రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు.

Leave A Reply

Your email address will not be published.