ఎపిలో ‘స్థానిక’ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి : ఎంపి రఘురామకృష్ణ‌రాజు

అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు ఎపి ఎన్నికల సంఘానికి బుధవారం ఆయన లేఖ రాశారు. ఆలస్యం లేకుండా ప్రకటన విడుదల చేయాలని ఎస్‌ఇసిని కోరారు. కరోనా ప్రభావం తగ్గిందని, పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయని, రాష్ట్రంలోనూ నిర్వహించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రఘురామ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఆయన అదే డిమాండ్‌ను వినిపించారు. స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం కరోనా పేరు చెప్పి ఎన్నికల్ని వాయిదా వేస్తుందని అప్పటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.