ఈ ఆరేండ్లలో కనీసం 6 రూపాయల పనియైనా కేంద్రం చేసిందా?: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఈ ఆరేండ్లలో కనీసం రూ.6 రూపాయల పనియైనా కేంద్రం చేసిందా అని ప్రశ్నించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది బీజేపీ నేతల తీరు అని ఐటి మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌గా రాజ్‌కుమార్ పటేల్‌ను, వెంగళ్రావునగర్ నుంచి దేదీప్యారావు, షేక్‌పేట్ నుంచి సత్యనారాయణ యాదవ్, సోమాజీగూడ నుంచి వనం సంగీత శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఆంధ్రా, తెలంగాణ పంచాయతీ అయితదా? హైదరాబాద్‌లో కరెంట్ ఉంటదా? ఉద్యోగాలు వస్తాయా? పెట్టుబడులు కొత్తవి కాదుకదా.. ఉన్నవి కూడా పోతయట అని ఇలా నానా రకాలుగా ఆనాడు ప్రచారం చేశారు. మంచినీళ్లకు ఎంత గోస ఉండె. వారం, పద్నాలుగు రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి చూశాం. ఆనాడు కరెంటు ఉంటే వార్తా. ఆరేండ్ల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు.