‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి చిరు, అమీర్‌ఖాన్‌ వాయిస్‌ ఓవర్‌?

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా అప్‌డేట్స్ గురించి అభిమానులు వెయిట్ చేస్తుంటారు. కొత్తగా ఆర్‌ఆర్‌ఆర్‌ లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రలను తెలుగులో చిరంజీవి, హిందీలో ఆమిర్‌ ఖాన్‌ పరిచయం చేయనున్నారా? అంటే… ‘అవును’ అనే సమాధానం వినపడుతోంది. ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చారిత్రక చిత్రానికి అగ్ర హీరోలు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం.

ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌… ఒకరి పాత్రను మరొకరు పరిచయం చేశారు. సినిమాలో వీరిద్దరి పాత్రలను అగ్ర హీరోతో పరిచయం చేయిస్తే బావుంటుందని రాజమౌళి భావిస్తున్నారట. వాయిస్‌ ఓవర్‌కి తెలుగులో చిరంజీవి, హిందీలో ఆమిర్‌ ఖాన్‌ అంగీకరించారట. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎవరితో వాయిస్‌ ఓవర్‌ చెప్పించాలని ఆలోచిస్తున్నారట. ఆయా భాషల్లో అగ్ర కథానాయకులతో చర్చలు సాగిస్తున్నారట. ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరిస్‌, రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు.

 

Leave A Reply

Your email address will not be published.