గిరిజన సంక్షేమ సమస్యలను పరిష్కరించాలి: SFI
మహబూబాబాద్ (CLiC2NEWS): జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల గిరిజన సంక్షేమ సమస్యలను పరిష్కరించాలని ఎస్ ఎఫ్ ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఐటిడిఏ ముందు దర్నాచేశారు.

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగారపు రజిని కాంత్, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు , ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి అమీర్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఈ దర్నాలో పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టని గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్ల పై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వార డిమాండ్లను పొందుపరిచిన వినతి పత్రం APO అందజేశారు. దీనికి సానుకూలంగా స్సందించన APO.. త్వరలోనే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.