కోతి ముఖంతో వింత జీవికి జన్మనిచ్చిన మేక..!
కాన్పూర్ : అక్కడక్కడ వింత రూపాలతో జంతువులు జన్మినిస్తున్న సంగతి తెలిసిందే. రూపాన్ని బట్టి దేవుళ్లతో పోలుస్తూ వాటికి పూజలు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇటువంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోనూ జరిగింది. కోతిముఖంతో మనిషిని పోలిన వింత జీవికి ఓ మేక జన్మనిచ్చింది. దీంతో అక్కడున్నవారంతా హనుమంతునిగా భావించి ఆ విచిత్ర జీవికి పూజలు చేశారు.
అయితే ఈ జీవి జన్మించిన కొద్దిసేపటికే మరణించింది. ఆ జీవిని చూసేందుకు అక్కడ జనం భారీగా తరలివచ్చారు. వచ్చిన వారందరూ దందాడు పెడుతూ, డబ్బులు వేస్తున్నారు. కాన్పూర్‌లోని జహంగిరాబాద్ నివాసి సీతారామ్‌కు చెందిన ఒక మేక విచిత్ర జీవికి జన్మనిచ్చింది. క్షణాల్లోనే ఈ విషయం ఊరంతా తెలియడంతో ఆ జీవిని చూసేందుకు జనాలు క్యూ కట్టారు.
కొంత మంది దానిని కలియుగంలో హనుమంతుని అవతారం అంటూ వదంతులు సృష్టించారు. దీంతో ఆ వింతజీవికి స్థానికులు పూజలు చేయడం ప్రారంభించారు. అంతేకాదు, కరోనా వైరస్ మహమ్మారి అంతానికి ఇది సంకేతమని ప్రచారం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించడంతో వేలాది రూపాయాలు కానుకల రూపంలో వచ్చింది. అయితే, కొద్ది సేపటికే ఆ వింతజీవి చనిపోయింది. దీంతో ఆ జీవిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఖననం చేశారు.