పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,22 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి నేటి నుండే అమల్లోకి వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ.. అక్టోబర్ 9వ తేదీన షెడ్యూల్‌పై స్టే విధించిన సంగతి తెలిసిందే.
పంచాయితీ ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో జరగనున్నాయి.
తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 27వ తేదీ నుండి నామినేషన్లు స్వీకరిస్తారు.
రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. వీటికి సంబంధించి నవంబర్ 30 నుండి నామినేషన్లు స్వీకరిస్తారు .
మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ దశకు సంబంధించిన నామినేషన్లను డిసెంబర్ 3వ తేదీ నుండి స్వీకరిస్తారు.
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు.. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
20 యేళ్లుగా ఉచితంగా పాలు, బిస్కెట్లు అందిస్తున్న `పాలతాత`!
[…] పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడు… […]