Goa: క్ల‌బ్‌లో సిలిండ‌ర్ పేలి 25 మంది మృతి

ప‌నాజీ (CLiC2NEWS): గోవాలోని ఓ క్ల‌బ్‌లో శ‌నివారం అర్ధ‌రాత్రి సిలిండ‌ర్ పేలి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఉత్త‌ర గోవాలోని అర్పోరా గ్రామంలో బ‌ర్చ్ బై రోమియో లేన్ నైట్ క్ల‌బ్‌లో చోటుచేసుకుంది. ఈ క్ల‌బ్‌ గోవా రాజ‌ధాని ప‌నాజీకీ 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.  సిలిండ‌ర్ పేల‌డంతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణించిన వారిలో న‌లుగురు ప‌ర్యాట‌కులు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. సిఎం ప్ర‌మోద్ కుమార్ ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ప్ర‌మాదంపై వివ‌రణాత్మ‌క ద‌ర్యాప్తు నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌లేద‌ని తేలితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

 

Job News: రైట్స్ గురుగ్రామ్‌లో ఇండివిడ్యువ‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్టులు

1 Comment
  1. […] Goa: క్ల‌బ్‌లో సిలిండ‌ర్ పేలి 25 మంది మృత… […]

Leave A Reply

Your email address will not be published.