మెజారిటీ అభ్యర్థులు బిజెపి సర్పంచ్ స్థానాలు గెలుస్తారు: పైడి ఎల్లారెడ్డి
కామారెడ్డి (CLiC2NEWS) : మెజారిటీ అభ్యర్థులు బిజెపి సర్పంచ్ స్థానాలు గెలుస్తారని శాస్త్రవేత్త, బిజెపి సమన్వయకర్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని దేవి విహార్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల్లో బిజెపి అభ్యర్థులు సర్పంచ్ స్థానాలను గెలుపొందుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, పథకాలు అమలు చేయని పరిస్థితి అందరికీ తెలిసిందేనన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాలుగు స్తంభాల ఆట ఆడుతుందని, కాంగ్రెస్ పరిస్థితి చివరికి అదే గతి పడుతుందని, బిజెపి పట్టణాల్లోనే గాక గ్రామాల్లో కూడా మోడీ ప్రభంజనంతో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు.
Job News: రాష్ట్రంలో 94 సివిల్ జడ్జ్ పోస్టులు